KKD: ప్రజల సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని రుడా చైర్మన్, జిల్లా TDP ఇంచార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి పేర్కొన్నారు. శనివారం రాజానగరం TDP కార్యాలయం వద్ద ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. వాటిని అధికారుల దృష్టికి వెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
సత్యసాయి: పెనుకొండలో విద్యార్థుల ఉన్నత విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ మంత్రి సవిత ఆదేశాల మేరకు SRR చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ల్యాప్‌టాప్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పెనుకొండకి చెందిన రాము కుమారుడు హరీశ్‌కు ట్రస్ట్ డైరెక్టర్లు, నాయకులు శనివారం ల్యాప్‌టాప్‌ను అందజేశారు. హరీష్ అనంతపురంలోని అనంతలక్ష్మి కాలేజీలో బీటెక్ చదువుతున్నారు.
AP: విజయవాడ పటమట పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని ఇద్దరు బాలికలపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. పాడుబడిన భవనంలోకి తీసుకెళ్లి బాలికలపై త్రినాథ్ అనే యువకుడు అత్యాచారం చేసినట్లు బాధితుల తల్లిదండ్రులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. త్రినాథ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: రైతు రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ఒట్టు పెట్టిన CM రేవంత్, నేటికీ ఆ హామీని నెరవేర్చలేదని మాజీమంత్రి హరీష్ రావు విమర్శించారు. సిద్ధిపేట నియోజకవర్గంలో 22,819 మంది రైతులకు ఇంకా 300 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. కేవలం 48% మందికే రుణమాఫీ అయిందని, మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రైతులను నమ్మించి వంచించడం కాంగ్రెస్ మార్క్ రాజకీయం అని ఆయన ధ్వజమెత్తారు.
ELR: కైకలూరులో శనివారం రంజాన్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్సీ జయ మంగళ వెంకటరమణ పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే, వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మతసామరస్యానికి ప్రత్యేక రంజాన్ పండుగ అని సూచించారు.
TG: ‘మాది శ్రమ ఫలితం.. మీది కేవలం శిలాఫలకం’ అంటూ మాజీమంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. నర్మెట్టలో మలేషియన్ టెక్నాలజీతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని BRS ప్రభుత్వమే తెచ్చిందని గుర్తు చేశారు. కాళేశ్వరం నీళ్లు రావడం వల్లే ఆయిల్ ఫామ్ సాగు పెరిగిందని, నాడు ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూసిన సీఎం రేవంత్, నేడు తాము చేసిన పనులకు రిబ్బన్లు కట్ చేస్తున్నారని విమర్శించారు.
బరువు తగ్గాలనుకునే వారికి పుచ్చకాయ బెస్ట్ అని చెప్పాలి. ఇందులో 90% పైగా వాటర్ ఉంటుంది. దీనివల్ల శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. అతిగా తినకుండా కంట్రోల్ చేయడంలో ఇది సహాయపడుతుంది. పుచ్చకాయ తింటే బరువు తగ్గొచ్చు. ఇందులోని ‘లైకోపీన్’ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండెకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే హార్ట్ స్ట్రోక్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.
E.G: రాజమండ్రి అర్బన్, రూరల్ పరిధిలో శనివారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ మేరకు పండగ విశిష్టతను మత గురువులు వివరించారు. ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కాగా సంప్రదాయ దుస్తులను ధరించి చిన్నారులు సందడి చేశారు.
KNR: మానకొండూర్ మండల కేంద్రంలోని మసీదులో పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ ముస్లిం సోదరులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సామరస్యాన్ని పెంపొందించుకోవాలని ఆకాంక్షించారు. మైనారిటీ ల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ముస్లిం నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
NDL: ఇజ్రాయెల్-అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావంతో కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు భారీగా పడిపోయాయి. గత వారం జిల్లాలో ఒక్క గుడ్డు రూ.6.50కు పైగా ఉండగా, ప్రస్తుతం రూ.4.50కు పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. ఈ పరిణామం జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
AP: తిరుమల పిండిమర ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇక్కడ నీరు, ఆహార పదార్థాలు, ముడి సరకుల నాణ్యతను ల్యాబ్‌లో పరీక్షించనున్నారు. 12 వేల చదరపు అడుగుల్లో రెండంతస్తుల్లో వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ లేబరేటరీ నిర్మించారు. రూ. 20 కోట్లతో అత్యంత ఆధునిక యంత్రాలతో కూడిన లేబరేటరీని ఏర్పాటు చేశారు.
W.G: తాడేపల్లిగూడెంలోని పాతూరు మసీదు సమీపంలోని ఖబరిస్తాన్ (స్మశాన వాటిక) అభివృద్ధికి రూ.2 లక్షలు ఇస్తానని ఫిబ్రవరి 13న జరిగిన ముస్లింల ఆత్మీయ సమావేశంలో నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ వడ్డి రఘురామ్ నాయుడు హామీ ఇచ్చారు. శనివారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద మసీదు కమిటీకి ఆ నగదు అందచేశారు. అనంతరం వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
BHPL: గణపురం మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన హరి సంపత్ కుమార్ శర్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు తదితరులు ఉన్నారు.
KDP: ఒంటిమిట్ట మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి (19) అదృశ్యమైనట్లు కుటుంబసభ్యులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెల్లవారుజామున ఇంటి నుంచి వెళ్లిపోయి ఆ తర్వాత కనిపించలేదని తెలిపారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై శ్రీనివాసులు వెల్లడించారు.
వొడాఫోన్-ఐడియా, BSNL కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో టవర్లు, ఫైబర్, స్పెక్ట్రమ్‌ను పంచుకోవాలని రెండు సంస్థలు చర్చలు జరుపుతున్నాయి. ఉమ్మడిగా మౌలిక సదుపాయాలను వినియోగించుకోవడం ద్వారా నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలని భావిస్తున్నాయి. ఈ రెండు దిగ్గజాలు చేతులు కలిపితే టెలికాం రంగంలో కొత్త సమీకరణాలు మొదలయ్యే అవకాశం ఉంది.