NLG: చిట్యాల పట్టణంలో బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక భువనగిరి రోడ్డుపై రాస్తారోకో, నల్ల జెండాల ప్రదర్శన నిర్వహించారు. HCU భూమిని ప్రైవేటు వారికి అప్పగించాలనే ప్రభుత్వ యోచన విరమించుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 400 ఎకరాల HCU భూములను చౌకగా అక్రమ పద్ధతుల్లో కొళ్ళగొడుతున్నారన్నారు.