ATP: గార్లదిన్నెలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి నేరుగా వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన అర్జీలు అధికంగా వచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు. వీటన్నింటిపై విచారణ జరిపించాలని ఆమె అధికారులకు ఆదేశించారు.