ప్రకాశం: ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆదేశాలతో చీరాలలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు గంజి పురుషోత్తం, పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావులు పాల్గొని ఆయా సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరించారు. మొత్తం 130 అర్జీలు వచ్చాయని, ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు.