KMR: రెవెన్యూ వసూళ్లలో కామారెడ్డి ఆర్టీఏ రాష్ట్రంలోనే టాప్లో నిలిచింది. ఈ మేరకు డీటీవో శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. గతేడాది లక్ష్యం రూ.63 కోట్లు ఉండగా, ఈసారి రూ.73 కోట్ల లక్ష్యానికిగాను రూ. 68.19కోట్లు (92.4 %) వసూలు చేసినట్లు పేర్కొన్నారు.