ASR: కీటక జనిత వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం కింద పలు శాఖల అధికారులతో కీటక జనిత వ్యాధుల నియంత్రణపై కలెక్టరేట్లో బుధవారం సమావేశం నిర్వహించారు. గత ఏడాది చేపట్టిన మలేరియా నివారణ చర్యలపై ఆరా తీశారు. జిల్లాలో మలేరియా, డెంగ్యూ మరణాలు జరగకూడదన్నారు.