NRPT: పేద ప్రజలకు ప్రభుత్వం నాణ్యమైన సన్న బియ్యం అందజేస్తున్నదని అదనపు కలెక్టర్ రెవెన్యూ బెన్ షాలోమ్ తెలిపారు. బుధవారం కృష్ణా మండల కేంద్రంలోని చౌక ధర దుకాణంలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం అందజేస్తామని తెలిపారు.