NLG: దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలోని ప్రజా పాలన సేవ కేంద్రం ద్వారా రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ వై. సుదర్శన్ బుధవారం తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ఈనెల 14 వరకు దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని, సంబంధిత పత్రాలను మున్సిపల్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.