KRNL: గ్రామాల్లో పశువులకు తాగునీటి సమస్య తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీటి తొట్టెల నిర్మాణం చేపట్టిందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. బుధవారం కర్నూలు మం.దిన్నెదేవరపాడు గ్రామ శివార్లలో పశువుల కోసం నీటి తొట్టె నిర్మాణానికి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే దస్తగిరి భూమిపూజ నిర్వహించారు. ఉపాధి పథకంలో భాగంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నామన్నారు.