KKD: ఏప్రిల్ 4వ తేదీన కరప గ్రామ పంచాయతీ వద్ద దివ్యాంగులకు రాయితీతో కూడిన ఆర్టీసీ బస్సు పాసులు జారీ చేస్తామని కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్ ఓ ప్రకటనలో తెలిపారు. వైద్యులు జారీ చేసిన సదరం సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు,100 రూపాయలుతో దివ్యాంగులు నాలుగో తేదీ ఉదయం పంచాయతీ కార్యాలయానికి రావాలని సూచించారు. ఈ బస్సు పాస్‌కు 3సంవత్సరాల కాలపరిమితి కలదు.