SDPT: జిల్లా కేంద్రంలోని మారుతీ నగర్లో అర్ధరాత్రి ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒక కారు, 3 బైక్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.