అన్నమయ్య: చిట్వేల్లో పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా ముస్లిం సోదరులు శనివారం ఈద్ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈద్గా వద్ద ప్రత్యేక నమాజ్ నిర్వహించి, ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. పెద్దలు, పిల్లలు కొత్త దుస్తుల్లో పాల్గొని, సమాజంలో సౌహార్దం, ఐక్యతను చాటుతూ వేడుకలను ప్రశాంతంగా జరుపుకున్నారు.