E.G: రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీ గ్రామానికి చెందిన ఓ యువతి (22) అదృశ్యమైంది. మార్చి నెల 20 తేదీ నుంచి ఆ యువతి ఆచూకీ కోసం తల్లి ఎంత ప్రయత్నించినా కనిపించలేదు. దీంతో తల్లి మంగళవారం బొమ్మూరు స్టేషన్ను ఆశ్రయించింది. ఆ తల్లి ఫిర్యాదు మేరకు బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.