KMM: బోనకల్లు రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం రైలు ప్రమాదంలో గుర్తు తెలియని యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..రైల్వే ట్రాక్‌పై దాదాపు 30 సం.యువకుడు మృతిచెంది కనిపించాడు. ఖమ్మం అన్నం ఫౌండేషన్ నిర్వాహకుడు శ్రీనివాసరావు సహాయంతో మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు