TG: ఢిల్లీలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టాం. దేశానికి ఓ రోల్ మోడల్‌గా తెలంగాణ నిలిచింది. రిజర్వేషన్లు పెంచడం కేంద్రం పరిధిలోని అంశం. మా రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచుకుంటామని మేం కోరాం. ఇందుకు అనుమతి ఇచ్చేందుకు మోదీకి ఇబ్బంది ఏంటి?’ అని ప్రశ్నించారు.