కృష్ణా: ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు కృత్తివెన్ను మండలం చినపాండ్రాక పంచాయతీ పరిధిలోని గ్రామాలలో ఓఎన్జీసీ సంస్థ సభ్యులు మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. వేసవి దృష్ట్యా నీటి ఎద్దడి ఎక్కవగా ఉండటంతో ప్రజలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నామని సభ్యులు తెలిపారు.