AP: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నమోదైన కేసుకు సంబంధించి మూడోసారి నోటీసులు ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారు. కాకాణి నెల్లూరుకు చేరుకున్న వెంటనే నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని కాకాణికి ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. అయితే, విచారణకు హాజరు కాకపోవడంతో తదుపరి కార్యాచరణకు సంబంధించి పోలీసులు చర్చిస్తున్నారు.