KNR: సన్న బియ్యం పథకం పేదల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. బుధవారం రామడుగు మండలం వేదిర గ్రామంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి సన్న బియ్యం ఉచిత పంపిణి ప్రారంభించారు. దేశ చరిత్రలో సీఎం రేవంత్ రెడ్డి విప్లవాత్మకంగా చేపట్టారన్నారు.