KMM: విజయ్ దివస్ సందర్భంగా అమర జవాన్ల స్థూపం వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పుష్పగుచ్చం సమర్పించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు నివాళులర్పించారు. గవర్నర్ మాట్లాడుతూ..1971లో భారత సైనికులు ప్రదర్శించిన అపూర్వమైన ధైర్య సాహసాలతో బంగ్లాదేశ్ విముక్తి సాధించిన రోజు విజయ్ దివస్ చరిత్రలో గర్వించదగ్గ రోజు అన్నారు.