ATP: గుంతకల్లులో ఈనెల 19న జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ కార్యాలయ ప్రతినిధులు గురువారం తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఈనెల 19న శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుందన్నారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.