ADB: వందశాతం పోలింగ్ నమోదు లక్ష్యంగా అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో సంబంధిత అధికారులతో గూగుల్ మీట్ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. మూడవ విడత గ్రామపంచాయితీ ఎన్నికల పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్, పోలింగ్, కౌంటింగ్ నిర్వహణపై సమీక్షించినట్లు తెలిపారు.