AP: విశాఖలోని మధురవాడలో ప్రేమోన్మాది నవీన్ తల్లి, కూతురిపై దాడి చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే, ఈ దాడికి పాల్పడిన నవీన్‌ను పోలీసులు శ్రీకాకుళం సమీపంలో అరెస్టు చేశారు. దాడి చేసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, హోంమంత్రి సీరియస్ తీసుకున్నారు.