ATP: గుత్తి రైల్వే స్టేషన్ మేనేజర్ ద్విచక్ర వాహనం గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. బుధవారం సాయంత్రం గుత్తి రైల్వే బుకింగ్ కార్యాలయం ఎదుట తన వాహనాన్ని పార్కింగ్ చేసి వెళ్లారు. రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లడానికి బుకింగ్ కార్యాలయం వద్దకు వచ్చి చూస్తే వాహనం కనబడలేదు. దీంతో ద్విచక్ర వాహనం చోరికి గురైనట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.