AP: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే వున్నం హనుమంతరాయ చౌదరి అనారోగ్యంతో తెల్లవారుజామున కన్నుమూశారు. టీడీపీలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన, ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా, మార్ఫెడ్ ఛైర్మన్‌గా సేవలు అందించారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన మృతిపై రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
SDPT: సిద్దిపేట మండలం చింతమడకలోని సీతారామచంద్రస్వామి ఆలయ నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన, శ్రీరామనవమి వేడుకలకు రావాలని మాజీ సీఎం కేసీఆర్‌ను ఆలయ కమిటీ ఆహ్వానించింది. బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల వంశీధర్ రావు ఆధ్వర్యంలో ప్రతినిధులు కేసీఆర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 25, 27 తేదీల్లో ఈ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
SRD: ఆందోల్ కేజీబీవీ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశపరీక్ష కోసం ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని జీసీడీవో సునీత శుక్రవారం తెలిపారు. పదో తరగతి చదువుతున్న బాలికలు www.tgrjc.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. మే 3న ప్రవేశ పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
NGKL: ఉప్పునుంతలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘ప్రగతి ప్రణాళిక ఆరోగ్య మిషన్-99 రోజులు’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భారీ వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో ఆరుగురు స్పెషలిస్ట్ వైద్యులు పాల్గొని రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. ముఖ్యంగా మాతా-శిశు సంరక్షణ, కిషోర బాలికల ఆరోగ్యం, వయోవృద్ధుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.
NRPT: ఎస్టీ గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాజారాం తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన ఎస్టీ విద్యార్థులు మే 19న నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tgtwreis.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల...
MBNR: పాలమూరు విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.20 కోట్లు కేటాయించడంపై వీసీ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో రూ.13 కోట్లు ఉండగా, ఈసారి అదనంగా రూ.7 కోట్లు పెంచడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ‘పీఎం ఉషా’ పథకం ద్వారా వచ్చిన రూ.100 కోట్లతో వర్సిటీలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
SRD: ఉపాధ్యాయుల జీపీఎఫ్ బిల్లుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నేతలు జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో స్వప్నకు వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఆమె.. ప్రస్తుతం ముగ్గురు అధికారులతో ఆడిట్ ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటివరకు 60 బిల్లులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన పెండింగ్ బిల్లులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
GDWL: రాజోలిలోని ఆర్డీటీ కాలనీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దస్తగిరి శుక్రవారం పరిశీలించారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిర్మాణాలు వేగంగా పూర్తి చేస్తే బిల్లులు అంతే త్వరగా వస్తాయని, పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
1857: జపాన్‌లో భూకంపంతో లక్ష మంది మృతి1970: సినీనటి శోభన జననం1978: సినీనటి రాణీ ముఖర్జీ జననం➣ ప్రపంచ అటవీ దినోత్సవం➣ అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం➣ ప్రపంచ కవితా దినోత్సవం➣ అంతర్జాతీయ భూగోళ దినోత్సవం
‘సూరత్ క్రికెట్ టీ20 లీగ్’లో గుజరాత్ బ్యాటర్ ఆర్య దేశాయ్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 81 బంతుల్లోనే 193 పరుగులు చేసి టీ20 చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో IPLలో క్రిస్ గేల్ (175*) పేరిట ఉన్న రికార్డును ఆర్య తిరగరాశాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఆర్య దేశాయ్ ఒక్కసారిగా క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాడు.
TG: కామారెడ్డి జిల్లా ఘన్‌పూర్‌లో కవలలు కీర్తన, కీర్తిలను వివాహం చేసుకున్న కవల సోదరులు విజయ్, వినయ్‌ల కుటుంబంలో విషాదం నెలకొంది. ఉగాది రోజు వినయ్ మానేరు జలాశయంలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ‘ట్విన్స్ డే’ రోజున జరిగిన ఈ వివాహం, ఇంతలోనే విషాదాంతం కావడం స్థానికులను కలచివేస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AP: ప్రభుత్వం పలువురు IAS అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. CRDA కమిషనర్ కన్నబాబును పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా నియమించగా, ఆయన స్థానంలో విజయరామరాజుకు బాధ్యతలు అప్పగించింది. మార్కాపురం కలెక్టర్‌గా విజయ సునీత, పోలవరం జిల్లా కలెక్టర్‌గా దినేశ్ కుమార్‌ను నియమించింది. రవి సుభాష్‌కు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల బాధ్యతలు అప్పగించింది.
రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవల ఈ ఫ్రాంచైజీ అమ్మకం ప్రక్రియలో రూ.16,000 కోట్ల(1.7 బిలియన్ డాలర్లు)తో వచ్చిన భారీ బిడ్‌ను ఆ జట్టు యాజమాన్యం తిరస్కరించింది. ఇంత పెద్ద మొత్తాన్ని కాదనుకోవడంపై క్రీడా నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ఎక్కువ నిధులు ఆశించి రాజస్థాన్ రిస్క్ చేస్తోందని వారు విశ్లేషిస్తున్నారు.
రణవీర్ సింగ్, ఆదిత్య ధర్‌ల మూవీ ‘ధురందర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించాడు. సినిమా చాలా ‘రా’గా, గ్రిప్పింగ్‌గా ఉందని, రణవీర్ పెర్ఫార్మెన్స్ అద్భుతమని కొనియాడాడు. మాధవన్, సంజయ్ దత్ నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని చరణ్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
దర్శకుడు జీతూ జోసెఫ్, మోహన్ లాల్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉండగా, గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అక్కడ మోహన్ లాల్‌కు ఉన్న భారీ మార్కెట్ దెబ్బతినకుండా ఉండేందుకే ఈ వాయిదా అని టాక్.