GNTR: ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, వసతీ గృహాల్లో బాల, బాలికలు, మహిళలపై నేరాల నియంత్రణ కోసం ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మీ సూచించారు. బుధవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో ఎస్పీ సతీశ్ కుమార్తో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వసతీ గృహాల స్వాగత ద్వారాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు.