SRPT: సూర్యాపేటలో రేషన్ షాప్ నెం 14ను జిల్లా కలెక్టర్ తేజస్ పరిశీలించారు. కలెక్టర్ లబ్ధిదారులతో బియ్యం నాణ్యత బాగుందా అని అడిగి తెలుసుకున్నారు. రేషన్ షాప్ లో ఉన్న స్టాక్, బియ్యం నాణ్యత, ఈ పాస్ మిషన్లో జరుగుతున్న లావాదేవీలు పరిశీలించారు. రెండు రోజులలో 1.24 లక్షల మంది లబ్ధిదారులకి 2500 మెట్రిక్ టన్నుల పంపిణి చేయటం జరిగిందని పేర్కొన్నారు.