ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రైవసీని పెంచేందుకు ‘ఆఫ్టర్ రీడింగ్’ అనే కొత్త ఫీచర్ను పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా పంపిన మెసేజ్, అవతలి వ్యక్తి చదివిన వెంటనే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ప్రస్తుతం బీటా దశలో ఉన్న ఈ ఆప్షన్ వల్ల సీక్రెట్ మెసేజ్లకు మరింత భద్రత లభిస్తుంది. పాత డిసపియరింగ్ ఫీచర్ లాగా సమయంతో సంబంధం లేకుండా, చదవడమే ఆలస్యం మెసేజ్ మాయమవుతుంది.