కొత్త సంవత్సరం అనగానే మందుబాబులు రెచ్చిపోతారు. నిజం చెప్పాలంటే… రోజూ మద్యం సేవించే వారు మాత్రమే కాదు…. మందు అలవాటు ఉన్నవారందరూ.. దాదాపు ఒక్క పెగ్ అయినా వేయాలనే అనుకుంటారు. అలాంటివారి కోసం తెలంగాణ ప్రభుత్వం… ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. నార్మల్ గా అయితే… నగరంలో 10 లేదంటే… 11 గంటలకు అన్ని దుకాణాలు బంద్ అయిపోతాయి. కానీ… డిసెంబర్ 31 రోజు మాత్రం.. రాత్రి ఒంటి గంట వరకు మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు ఓపెన్ చేసి ఉంచవచ్చని చెప్పడం విశేషం.
డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట వరకు వైన్ షాపులు, బార్లు, పబ్‌లు తెరిచి ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రిటైల్ షాపుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు, 2B లైసెన్సు కలిగిన బార్లలో అర్ధరాత్రి 1 గంటల వరకు మద్యం విక్రయాలు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో వెల్లడించారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా మద్యం అమ్మకాలు ఆశించినంత లేనందున లైసెన్స్‌లు పొందిన షాపు యజమానులు, బార్ నిర్వాహకులకు మినహాయింపుగా మద్యాన్ని విక్రయించటానికి అదనపు సమయం కేటాయిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. న్యూ ఇయర్ వేళ తెలంగాణ సర్కార్ చెప్పిన గుడ్ న్యూస్‌తో మందుబాబులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.