AP: వైసీపీ నేత శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం కుమారుడి వివాహ వేడుకకు మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. బెంగళూరులోని తిరుమేనహళ్లిలో జరిగిన ఈ వేడుకలో నూతన వధూవరులు నాగ ఉమా యజ్జిత, యశ్వంత్‌లను ఆయన ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పెళ్లికి వచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలతో జగన్ ముచ్చటించారు.