ప్రస్తుత కాలంలో లేట్ మ్యారేజ్ ట్రెండ్ నడుస్తోంది. యువత ఎవరిని అడిగినా.. మేం సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటామని అంటుంటారు. అయితే మానసిక పరిణతి, ఆర్థిక స్థిరత్వం, కుటుంబ బాధ్యతలను మోయగల సామర్థ్యాన్ని బట్టి 25-32 ఏళ్ల వయసు పెళ్లికి అనుకూలమైనదిగా నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే మానసికంగా ఒత్తిడికి గురై.. దాంపత్య జీవితంపై ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు.