AP: రాజధాని అమరావతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరాతికి చట్టబద్ధతతో అనిశ్చితికి తెరపడిందని అన్నారు. ‘ఇకనుంచి రాష్ట్రానికి రాజధాని అమరావతి. గెజిట్ విడుదలైన ఏప్రిల్ 6వ తేదీ చరిత్రలో నిలిచిపోతుంది. ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజల కల సాకారమైంది’ అని పేర్కొన్నారు.