TG: జీవన్‌రెడ్డి BRSలోకి వెళ్లి తప్పు చేశారని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ములుగులో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమైన మహేష్.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 100 స్థానాల్లో గెలుస్తుందన్నారు. BRS పార్టీ ముక్కలైందని.. ఆస్తులకోసం కొట్టుకుంటున్నారని విమర్శించారు. BJPకి తెలంగాణలో ఆదరణ లేదన్నారు.