TG: వికారాబాద్లో ఇవాళ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశం జరగనుంది. పీఏసీ ఛైర్మన్ మీనాక్షీ నటరాజన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. ముఖ్యంగా రాజ్యసభ సభ్యుల ఎంపికపై పీఏసీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.