TG: జనాభా నియంత్రణను క్రమశిక్షణతో పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష వేస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఇక్కడి మహిళలకు, ఎస్సీ-ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ ఇక్కడి ప్రాంత ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని, అభివృద్ధిలో రాణిస్తున్న రాష్ట్రాలను వెనక్కి నెట్టడం సరికాదని సీఎం స్పష్టం చేశారు.