AP: తిరుపతి జిల్లా రాచర్లలో 220/132 కేవీ సబ్‌స్టేషన్‌ను మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. 2019లో సబ్ స్టేషన్‌ను ప్రారంభిస్తే.. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పూర్తి కాలేదన్నారు. గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని వెల్లడించారు. వచ్చే 3 నెలల్లో 6 లక్షల పీఎం సూర్యఘర్ కనెక్షన్లు పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.