AP: విశాఖ మౌనిక హత్యకేసులో క్లూస్ టీమ్ ఘటనాస్థలంలో ఆధారాలను సేకరించింది. ఈ క్రమంలో మృతురాలి తండ్రి వేణుగోపాల్ పోలీసుల ఎదుట కన్నీరుమున్నారై, న్యాయం చేయాలంటూ సీఐ కాళ్లపై పడ్డారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని, బాధిత కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని సీఐ భరోసా ఇచ్చారు.