థియేటర్లోకి జనాలు రావడం లేదనుకుంటున్న సమయంలో.. కంటెంట్‌తో వచ్చి హిట్ కొట్టి చూపించాడు కళ్యాణ్ రామ్. దాందో ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోసిన చిత్రంగా నిలిచింది బింబిసార. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. దాదాపు 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. 65 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది.
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పటికే చాలామంది తెలుగు జనాలు ఈ సినిమాను థియేటర్లోనే చూసేశారు. కానీ థియేటర్‌కి వెళ్లలేకపోయిన వారు ఓటిటి డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే మళ్లీ మళ్లీ ఈ సినిమాను ఓటిటిలో చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు నందమూరి అభిమానులు. అయితే ఈ సినిమా రిలీజ్ అయి రెండు నెలలు దాటిపోయినా ఇంకా ఓటిటిలోకి రాలేదు.
ఇక ఎట్టకేలకు బింబిసార ఓటిటి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇప్పటికే ‘బింబిసార’ డిజిటల్ హక్కులను దక్కించుకున్న జీ5 ఓటిటి సంస్థ.. దీపావళి కానుకగా ఈ సినిమాను ఓటిటి ఫ్లాట్ ఫామ్ పై తీసుకురాబోతోంది. అక్టోబరు 21 నుంచి బింబిసార జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుందని అధికారికంగా ప్రకటించారు. దాంతో బింబిసార ఓటిటి ఫ్యాన్స్ ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నారు. మరి బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపిన బింబిసార.. ఓటిటిలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.