AP: లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సిట్ మరో ఛార్జిషీట్‌ను ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్లో నిందితుడు ప్రణయ్ ప్రకాష్ పాత్రకు సంబంధించిన పలు కీలక అంశాలను సిట్ వివరించింది. సిట్ దాఖలు చేసిన ఛార్జిషీట్ ప్రకారం వివిధ డిస్టిలరీల నుంచి భారీ మొత్తంలో వసూళ్లు చేసిన వ్యవహారంలో ప్రణయ్ కీలక పాత్ర పోషించినట్లు పేర్కొంది.