TG: బాల్క సుమన్‌ను రిమాండ్‌కు పంపాలనే ఉద్దేశంతోనే FIRలో పదేళ్ల జైలు శిక్ష పడేలా పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ వంటి తప్పుడు సెక్షన్లను పోలీసులు చేర్చారని ఆయన తరఫు న్యాయవాది ఆరోపించారు. అధికారుల ఫిర్యాదు లేకుండానే ఈ కేసులు పెట్టారన్నారు. ఇప్పటికే ముందస్తు బెయిల్ దాఖలు చేశామని, ఈ అక్రమ చర్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లామని, విచారణకు తాము సిద్ధమేనని స్పష్టం చేశారు.