AP: వైసీపీ నేత శ్రీహరి అరెస్టు అరాచకం అని ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేశారని ఆరోపించారు. ముందు అరెస్టులు, తర్వాత సోదాలు అంటున్నారని విమర్శించారు. శ్రీహరిని భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారన్నారు. పోలీసులు పూర్తిగా పాలకులకు వంతపాడుతున్నారని వ్యాఖ్యానించారు. కనీసం FIR కాపీలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.