AP: వివేకా హత్యపై గతంలో డ్రామాలు ఆడారని CM చంద్రబాబు మండిపడ్డారు. ‘నారాసుర రక్త చరిత్ర’ అంటూ అబద్ధపు ప్రచారంతో ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు లడ్డూ విషయంలో తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేస్తూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. CBI నివేదికలున్నా తప్పుడు ప్రచారం ఆపడం లేదని, గత ప్రభుత్వం విధ్వంసం నుంచి కోలుకోవడానికి టైం పడుతుందన్నారు.