AP: ఇంటర్ ఫలితాలపై మంత్రి లోకేష్ స్పందించారు. ‘గత 12 ఏళ్లలోనే అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రభుత్వ, దాని అనుబంధ జూనియర్ కళాశాలల్లో గణనీయ పురోగతి సాధించింది. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరుత్సాహపడవద్దు. ఒక పాఠంగా తీసుకుని మరింత కృషి చేసి తిరిగి విజయాన్ని సాధించాలి. తల్లిదండ్రులు, టీచర్లు, సమాజం విద్యార్థులకు మానసికంగా తోడ్పడాలి’ అని సూచించారు.