AP: రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుంటే.. మన్యం, నెల్లూరు, ప్రొద్దుటూరు, మార్కాపురం జిల్లా దోర్నాలలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. మన్యం జిల్లా కురుపాంలో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది. దీంతో కొన్నిచోట్ల చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దోర్నాలలోనూ అనేక చోట్ల చెట్లు విరిగిపడి వాహనరాకపోకలకు అంతరాయం కలిగింది.