AP: వైసీపీ హయాంలో సాక్షి, భారతి సిమెంట్స్ రూ.వెయ్యి కోట్లు లబ్ధి పొందాయని మంత్రి లోకేష్ ఆరోపించారు. తాము ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేదని తెలిపారు. మార్కెట్లో కిలో నెయ్యి రూ.వెయ్యి పైన ఉంటే రూ.360కి ఇచ్చేది కల్తీ కాక మరేంటి? అని ప్రశ్నించారు. అలాగే, ఇందాపూర్ డెయిరీ.. హెరిటేజ్‌కు కో కంపెనీ అనడం విడ్డూరంగా ఉందన్నారు.