AP: రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్‌లో అవకతవకలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై శాప్ ఛైర్మన్ రవి నాయుడు స్పందించారు. క్రీడాకారుల భవిష్యత్‌తో ఆడుకుంటే ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన ఆయన.. ఇప్పటికే కబడ్డీ అసోసియేషన్‌పై క్రిమినల్ కేసు నమోదైనట్లు తెలిపారు. దీనిపై కబడ్డీ ఫెడరేషన్, కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు చెప్పారు.