AP: లేపాక్షి షోరూంలను అభివృద్ధి చేయడంతో పాటు, ఈ-కామర్స్ ద్వారా కళారూపాలను నేరుగా ఇంటికే చేరవేస్తామని మంత్రి సవిత తెలిపారు. ఢిల్లీ, కాకినాడ షోరూంలను వెంటనే అందుబాటులోకి తేవాలని, రాజమహేంద్రవరం విమానాశ్రయంలో కొత్త షోరూం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆమె సూచించారు.