TG: పక్షం రోజుల పాటు సాగే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ముఖ్యంగా ఆరు గ్యారంటీలు, రైతు భరోసా, మూసీ ప్రక్షాళన, హైదరాబాద్ మెట్రో విస్తరణ వంటి అంశాలపై సభలో వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ సమావేశాల కాలాన్ని మార్చి నెలాఖరు వరకు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది.