TG: ధాన్యం కొనుగోళ్లు యుద్ధప్రాతిపదికన చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులకు సూచించారు. అన్ని కేంద్రాలకు అవసరమైనన్ని లారీలు పెంచాలన్నారు. రోడ్లపై ధాన్యం పోయకుండా స్కూళ్లు, ఫంక్షన్ హాళ్ల వద్ద కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాల్లో తాగునీరు, టెంట్లు ఉండేలా చూడాలన్నారు. నల్లగొండ నియోజకవర్గంలో 2.30 లక్షల టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు.