ఎండల నుంచి ఉపశమనం కోసం బీరు తాగితే శరీరం చల్లబడుతుందనుకోవడం పొరపాటు. దీనివల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురై కాలేయం, జీర్ణక్రియ దెబ్బతింటాయి. అంతేకాకుండా పొట్ట పెరగడం, బీపీ, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి దాహానికి బీరు కాకుండా మంచినీళ్లు లేదా పండ్ల రసాలు తీసుకోవడమే మేలని వైద్యులు సూచిస్తున్నారు.