TG: హైదరాబాద్‌లోని కాచిగూడ, సంజయ్‌గాంధీ నగర్ ప్రాంతంలో పండ్లను మాగబెడుతున్న గోదాంలపై నిన్న రాత్రి ఆహార భద్రత, హెచ్-ఫాస్ట్ సిబ్బంది సోదాలు చేశారు. రసాయనాలతో మామిడి పండ్లను మాగబెడుతున్నట్లు గుర్తించారు. 48 ఇథిలిన్ రైపనర్ ప్యాకెట్లు, 288 కిలోల మామిడి పండ్లను స్వాధీనం చేసుకున్నారు. గోదాం నిర్వాహకులు పాటిల్ రామ్, సంగమేష్ సంబాడాలపై కేసు నమోదు చేశారు.